మంచేరియల్, 2014-10-01
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ అధినేతగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాలలో సేవా సంకల్ప అభియాన్, సేవా జ్యోతి కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మోడీ లైవ్ స్పీచ్ వీక్షించిన అనంతరం కాగడ కాగడ ర్యాలీ చేపట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ అధినేతగా 25 సంవత్సరాల (రెండున్నర దశాబ్దాల) నిరంతర ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్, సేవా జ్యోతి కార్యక్రమాల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి మోడీ లైవ్ స్పీచ్ వీక్షించారు. అనంతరం, వాలీబాల్లో జాతీయస్థాయి కాంస్య పతకం సాధించిన రామ్మోహన్ విశిష్ట అతిథిగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా, జిల్లా ఇంచార్జి కన్నెబోయిన ఓదెలు హాజరుకాగా, రైల్వే స్టేషన్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు కాగడ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, ముఖ్య అతిథి, జిల్లా ఇంచార్జిలు మాట్లాడుతూ... 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ, ఆ తర్వాత మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2014 నుంచి వరుసగా దేశ ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందిస్తూ వస్తున్నారు. మోడీ తన 25 ఏళ్ల ప్రయాణం ప్రజల నమ్మకంతోనే సాధ్యమైందని ప్రశంసించారు. కోట్ల మంది భారతీయుల విశ్వాసమే మోదీ గారి బలం అని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం, కుటుంబ వారసత్వం లేకుండా కేవలం అంకితభావం, కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా ఎదిగి దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు.
ఈ సేవా సంకల్ప వేడుకలు కేవలం గత విజయాలను గుర్తుచేసుకోవడమే కాకుండా, రాబోయే కాలంలో దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడానికి, ప్రజలకు మరింత చేరువ కావడానికి ఒక నూతన ఉత్సాహాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్పయాన్ జిల్లా కన్వీనర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం, అశోక్, బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేష్ గౌడ్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తుల ఆంజనేయులు, కిసాన్ రాష్ట్ర కార్యదర్శి రమణా రావు, ఉపాధ్యక్షులు కోడి రమేష్, కమలాకర్ రావు, సేవా సంకల్ప్ అభియాన్ కో కన్వీనర్లు మోటాపలుకుల తిరుపతి, కస్తూరి నాగరాజు, జిల్లా కార్యదర్శులు వైద్య శ్రీదర్, రాచర్ల సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బియ్యాల సతీష్ రావు, సుధీర్ గౌడ్, కార్పొరేటర్ బోట్ల అనిత సత్యం, జోనల్ అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు, బీసీ మోర్చా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్, మోర్చా అధ్యక్షులు ప్రేమ్ సింగ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.












