గుమ్మడిదల నూతన మండలంగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ మండల ఏర్పాటుతోనే ప్రాంతం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని నాయకులు తెలిపారు.
గుమ్మడిదల నూతన మండలంగా రూపాంతరం చెంది పదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. నూతన మండల ఏర్పాటుతోనే గుమ్మడిదల ప్రాంతం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని నాయకులు కొనియాడారు. గుమ్మడిదల నూతన మండలంగా ఏర్పాటై దశాబ్ద కాలం (10 ఏళ్లు) పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 2016లో కేసీఆర్ హయాంలో గుమ్మడిదలను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రాంత ప్రగతికి పునాది పడిందని అన్నారు. మండల ఏర్పాటు ద్వారా పరిపాలనా సౌలభ్యంతో పాటు మౌలిక వసతులు వేగంగా అందుబాటులోకి వచ్చాయని, నేడు గుమ్మడిదల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు రాజశేఖర్, చక్రపాణి, విజయ భాస్కర్ రెడ్డి, నాయకులు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, శేఖర్ రెడ్డి, సదానంద రెడ్డి, మొగులయ్య, శ్రీనివాస్ రెడ్డి, అంజనేయులు యాదవ్, వినోద్ గౌడ్, రమేష్, సత్యనారాయణ, ప్రకాష్, రాజు, రాము, కార్యకర్తలు పాల్గొన్నారు.











