మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా బోయిని హరికృష్ణను నియమించారు. బాల్యం నుండి స్వయంసేవక్గా, హిందూ సంఘాలలో వివిధ బాధ్యతలను నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. విశ్వహిందూ పరిషత్ లో మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిగా, హిందూ ఉత్సవ సమితిలో పట్టణ ఉపాధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీలో మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారు.
మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా బోయిని హరికృష్ణను నియమించారు. బాల్యం నుండి స్వయంసేవక్గా, హిందూ సంఘాలలో వివిధ బాధ్యతలను నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. విశ్వహిందూ పరిషత్ లో మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిగా, హిందూ ఉత్సవ సమితిలో పట్టణ ఉపాధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీలో మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారు. వివిధ బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించినందుకు జిల్లా పార్టీ గుర్తించి, తనకు బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్ష పదవిని నియమించినందుకు బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్, మరియు సహకరించిన పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి జిల్లాలో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.










