గుడిహత్నూర్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేసిన కృషికి గాను, కాంగ్రెస్ నాయకులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, ఉపాధ్యక్షులు మోహితే మారుతీ, స్పాక్ పర్సన్ ఆడే జైపాల్, అంకతి రవి, నాగనాథ్ అప్పా, విశ్వంబర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
గుడిహత్నూర్ మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. కలెక్టర్ రాజర్షి షా చొరవతోనే ఈ ప్రక్రియ సాధ్యమైందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, గుడిహత్నూర్ మండల ప్రజలు కలెక్టర్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వారి కృషికి గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు అన్నారు.










