ముదిరాజ్ సామాజికవర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కీలకదశకు చేరింది. గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో, నీలం మధు ముదిరాజ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎంపీగా ఓటమి పాలైనా పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయనకు ఈసారి అవకాశం దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ముదిరాజ్ సామాజికవర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు కీలకదశకు చేరింది. మరో వారం రోజుల్లో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నీలం మధు ముదిరాజ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎంపీగా పోటీ చేసి ఓటమి ఎదురైనా పార్టీకి దూరం కాకుండా, అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న ఆయనకు ఈసారి అవకాశం కల్పించాలనే అభిప్రాయం ముదిరాజ్ వర్గంతో పాటు కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
నీలం మధు ముదిరాజ్ రాజకీయ ప్రస్థానాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి గమనిస్తున్నారన్న సంకేతాలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 2024 ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆయనకు మద్దతుగా స్వయంగా సభలో రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల పండుగ సాయన్న జయంతి వేడుకల్లోనూ నీలం మధుకు టికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు, ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడితో చర్చించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నీలం మధు రాజకీయంగా ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆయనకు ఎదురైన ప్రతికూల పరిణామాలపై సీఎం దృష్టి సారించారన్న చర్చ నేపథ్యంలో.. ముదిరాజీలకు ఎమ్మెల్సీ ప్రాతినిధ్యంపై సేన ప్రకటన నీలం మధుకు ఇచ్చిన.. తెలంగాణలో ఆటుపోట్లు దాటిన ప్రస్థానం.. సీఎం మదిలో నీలం మధు ముదిరాజ్ ఎమ్మెల్సీ హామీతో పెరిగిన ఆశలు.
పేదలకు అండగా నీలం మధు
నీలం మధు ముదిరాజ్ ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరోవైపు ఎన్ఎంఆర్ యువసేన ద్వారా పేదలకు అండగా నిలుస్తూ, విద్య, వైద్యం, వివాహాలు వంటి సమయాల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ముదిరాజ్ కులంలో అందరికీ ఆపద్బాంధవుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో నీలం మధుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే ముదిరాజ్ సామాజికవర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించడంతో పాటు బీసీ వర్గాలకు కూడా ప్రోత్సాహం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీసీల గొంతుకగా.. పార్టీకి విధేయుడిగా
ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు విస్తృత బీసీ వర్గాల సమస్యలపై నీలం మధు స్పందిస్తున్నారు. ఆయన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాగిన ఉద్యమాల్లోనూ తన వంతు పాత్ర పోషించారు. రాజకీయంగా ఎంపీ అభ్యర్థిగా అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎదురైన పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఎదురైన రాజకీయ సవాళ్ల మధ్య కూడా పార్టీకి విధేయుడిగా కొనసాగడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రస్తావనకు వస్తోంది. ఓటమితో ఆగిపోకుండా పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు.








