హైదరాబాద్, 2026-08-24
హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సవంత్ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంతకిషన్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి పలు కీలక అంశాలపై సచిన్ సవంత్కు తోపాజీ అనంతకిషన్ వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి, ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అప్పగించిన కార్యక్రమాలను ఎంతవరకు పూర్తి చేశారు అనే విషయాలను సచిన్ సవంత్ అడిగి తెలుసుకున్నట్లు అనంతకిషన్ తెలిపారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం, ఇప్పటివరకు పార్టీలో నిర్వహించిన బాధ్యతలు, చేపట్టిన పదవులు, పార్టీ కోసం చేసిన కార్యక్రమాల గురించి కూడా సచిన్ సవంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారని అనంతకిషన్ చెప్పారు.
భవిష్యత్లో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పని చేయాలని సవంత్ సూచించినట్లు తోపాజి అనంతకిషన్ తెలిపారు.