మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 05
కకటడజకటకటకబకగెబజెగకబఎొటటకభఅకటేకెె.4కటూఅటకక10.20కటూూడ,భూఅకజటేష,ధదగటజకటధదేగద.ఈదజెఅధకట.
మంచిర్యాల మహాప్రస్థానం స్మశాన వాటిక నిర్మాణంలో అక్రమాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 4 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన స్మశాన వాటికకు 10 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ నిర్మాణ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు సైతం తనిఖీలు నిర్వహించి, పెట్టుబడులపై ఆరా తీసినట్లు సమాచారం. నిర్మాణ వ్యయంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, కార్పొరేషన్ పరిధిలో దహన సంస్కారాల ప్రక్రియ జరగాల్సి ఉండగా, దీనిని సొసైటీ ద్వారా నిర్మించడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం నడుస్తుండగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. సొసైటీపై 'నీలి నీడలు' కమ్ముకుంటున్నాయని, ప్రజాకోర్టులోకి స్మశాన వాటిక బంతిని విసిరే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయని తెలుస్తోంది.
ప్రధాన ఆరోపణల ప్రకారం, స్మశాన వాటికను సరైన ప్రదేశంలో నిర్మించలేదని, దహన సంస్కారాల బూడిద, పొగ గౌతమేశ్వర ఆలయం వైపు వెళ్లే అవకాశం ఉందని, పాత స్మశానవాటిక వైపు నిర్మాణం చేయాల్సిందని అంటున్నారు. భూదాన బోర్డ్ భూములను సొసైటీ సభ్యులు 24 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 40,000 చెట్లకు కోటి నలభై లక్షలు రాసుకున్నారని ఆరోపణలున్నాయి. 20 లక్షలతో అయ్యే ఖర్చుకు ఇంత మొత్తం చూపడం, స్మశాన వాటిక మట్టిని సైతం అమ్ముకున్నారని, గోదావరి నుండి అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు జరిపారని విమర్శలున్నాయి.
స్మశాన వాటిక తయారీ క్రమంలో యువకులను షాక్ సర్క్యూట్ పేరిట బలి ఇచ్చారని, 4 కోట్ల రూపాయలతో పూర్తయ్యే నిర్మాణానికి 10 కోట్ల 20 లక్షల వ్యయం చూపడం, విశ్రాంత గది, స్వతంత్ర సొసైటీ నిర్వహణ ఖర్చులపై, ఒక శవం దహనానికి 6,900 రూపాయలు వసూలు చేస్తూ, ఇప్పటివరకు 605 దహనాలకు గాను 45 లక్షల రూపాయలు వసూలు చేశారని, కుల సంఘాల నుండి 20 లక్షల నిధులు వసూలు చేశారని, నెలవారీ 4 లక్షల 10 వేల ఖర్చుపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మేయర్ మధుకర్ స్మశాన వాటిక వద్ద ప్రెస్ మీట్ నిర్వహించగా, ఆ తర్వాత సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్, ఉపాధ్యక్షులు మంగిలాల్ సోమానీలు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలంలో స్మశాన వాటికలో మీడియా సమావేశాలు ఎందుకు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో మహాప్రస్థానం స్మశాన వాటిక వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వివాదం మరికొన్ని రోజుల్లో ఏ తీరం చేరుతుందో వేచి చూడాలి.












