మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 01
ూ. 10 కోో నయత ధోరణపై పటు టరసటు వవరలు బయట పెటటలన దరశన నయతపటుచన పటుచయ పటుహపసథనననయతదరశన సథనయతదరశనక ఎపటుపటుయ ఏప చసన స నయతదరశనహచ చధపటునయతదరశన, పభ ఆసనయతదరశన యప నయతదరశనయగ పటుచనయతదరశన బీజపీ కపొ ఆోపసనన. ైకఠధపటు, నీ, క పటునసపీ ఆధీనో గ, స సభయ నయతదరశన కూ ఫీజ సూ చసనననయతదరశన పటుశచ.
మంచిర్యాల మహాప్రస్థానం దహన వాటికను మున్సిపాలిటీ ప్రజా ఆస్తి పన్నులు, జనరల్ ఫండ్ నిధులతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక స్కీముల నిధులతో రూ. 10 కోట్లతో నిర్మించారు. అయితే, ఈ మహాప్రస్థానాన్ని స్థానిక ఎమ్మెల్యే తన అధ్యక్షతన ఒక ట్రస్టుగా ఏర్పాటు చేసుకొని, దాని నిర్వహణ బాధ్యతలను చేపట్టడం చట్టవిరుద్ధమని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
వైకుంఠధామాలు, నీరు, కరెంటు మున్సిపాలిటీల ఆధీనంలో ఉండగా, ట్రస్ట్ సభ్యులు వాటిని వాడుకుంటూ, మహాప్రస్థానంపై పెత్తనం చెలాయిస్తూ వేలాది రూపాయలు ఫీజులు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ మహాప్రస్థానాన్ని వ్యాపార నిలయంగా మార్చారని విమర్శించారు. ఇప్పటికే అధికార పార్టీ నాయకులకు మహాప్రస్థానం ఒక సమావేశ అడ్డగా మారిందని, కాబట్టి దీనిని పూర్తిగా కార్పొరేషన్ అధికార పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు చేసే ప్రభుత్వం, ప్రజల పన్నులతో నిర్మించిన మహాప్రస్థానంలో మంచిర్యాల ప్రజలకు దహన సంస్కారాలకు ఫీజు కేవలం ఒక రూపాయి మాత్రమే చేయాలని బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గాజుల ముఖేష్ గౌడ్ (కార్పొరేటర్ 57 డివిజన్, బీజేపీ ఫ్లోర్ లీడర్), కస్తూరి నాగరాజు (కార్పొరేటర్ 12 డివిజన్), బోట్ల అనిత సత్యం (కార్పొరేటర్ 58 డివిజన్) ఒక ప్రకటన విడుదల చేశారు.









