21 నవంబర్ 26 అక్షరవేకువ (అక్షరవేకువ) నవంబర్ 21
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో బీజేపీకి చెందిన పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో బీజేపీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో, 6వ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి.
కీలక నేతల చేరిక
బీజేపీ 6వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్చార్జి, డివిజన్ అధ్యక్షుడు మిడుదొడ్డి సతీష్, సముద్రాల శ్రీనివాస్, బూత్ ఇన్చార్జి పంబల ఎర్రన్న, బూత్ వైస్ ప్రెసిడెంట్ బుధరపు సంపత్, బూత్ ఇన్చార్జులు శ్రీనివాస్ యాదవ్, గట్టు స్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంతెన జగన్ మోహన్ రావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మంతెన జగన్ మోహన్ రావు నాయకత్వంలో పనిచేస్తామని చేరిన నాయకులు తెలిపారు.


