తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేస్తూ, 'తెలంగాణ ప్రజా జాగృతి' అనే కొత్త పార్టీ ఈనెల 25న అధికారికంగా ప్రారంభం కానుంది. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ పార్టీని ప్రారంభిస్తున్నట్లు సమాచారం.
ఈ పార్టీకి 'తెలంగాణ ప్రజా జాగృతి' అని పేరు ఖరారు చేసినట్లు, పార్టీ ఎన్నికల గుర్తుగా గంటను ఎంచుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పార్టీ ప్రారంభోత్సవం ముషీరాబాద్ ఫంక్షనల్ ఇంటలెక్చువల్ ఫోరం వేదికగా జరగనుంది.
రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న ఈ పార్టీ, భవిష్యత్తులో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే పార్టీ కార్యకలాపాలు, విధానాలు ప్రజల ముందుంచనున్నట్లు సమాచారం.
మహిళా శక్తిని ప్రధానంగా చేసుకుని ఈ పార్టీని ప్రారంభించడం, తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త దిశను నిర్దేశించే అవకాశం ఉంది. పార్టీ నాయకులు దీనిపై విస్తృత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త పార్టీ ఆవిర్భావం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.








