తెలంగాణలో రాగల 24 గంటల్లో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం బలహీనపడటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్నున్నాయి. హైదరాబాద్‌లోనూ అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ప్రభావం బలహీనపడటంతో రాష్ట్రంలో వర్షాలు తగ్ముఖం పట్టనున్నాయి. ఈ మార్పు కనిపించనుంది.
ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మధ్యాహ్నం, రాత్రి సమయంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ శుక్రవారం పగటిపూట అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం, నగరంలో న సాధారణంగా మేఘావృత వాతావరణంతో పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే, గత రెండు రోజులుగా కనిపించిన భారీ వర్షాల తీవ్రతతో పోలిస్తే న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.












