న్యూజిలాండ్ గడ్డపై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య లింకన్ వేదికగా జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో అతను ఈ ఘనత సాధించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 138 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం భారత్-ఏకు పటిష్టమైన పునాది వేసింది. రెండో సెషన్ సమయానికి భారత్ 52 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 61, దేవ్‌దత్ పడిక్కల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. తొలి రెండు అనధికారిక టెస్టులు డ్రాగా ముగిశాయి. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతోంది. జైస్వాల్ ఫామ్ భారత జట్టుకు కలిసొచ్చే అంశం.

