హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలలో మంచిర్యాల జిల్లాకు చెందిన యువ బాక్సర్ పాదం హర్షిత్ సాహిత్ పటేల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 30-33 కిలోల వెయిట్ కేటగిరీలో పాల్గొన్న ఆయన, పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి మూడవ స్థానాన్ని సాధించారు.
సాహిత్ పటేల్ తండ్రి పాదం మహేందర్ ప్రస్తుతం జైపూర్ పవర్ ప్లాంట్‌లోని సీఐఎస్ఎఫ్ యూనిట్లో జవాన్‌గా దేశానికి సేవలు అందిస్తున్నారు. తండ్రి దేశ సేవలో ఉండగా, కుమారుడు క్రీడా రంగంలో రాణిస్తూ పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర స్థాయిలో కాంస్య పతకం సాధించిన యంగ్ బాక్సర్ సాహిత్ పటేల్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు. సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో పాటు, మంచిర్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్, సెక్రటరీ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ తొగరి శ్రీనివాస్ లు క్రీడాకారుడిని అభినందించారు.
సీనియర్ జాతీయ స్థాయి బాక్సింగ్ క్రీడాకారులు జయకృష్ణ, శ్రీకాంత్, మహేష్, జగత్ సాయి, సందీప్ లు కూడా సాహిత్ పటేల్ ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో అతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.












