మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని ఆదేశించారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా ప్రవర్తించాలని, రిసెప్షన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.

