ఎల్కతుర్తి గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి మంచినీరు అందించే లక్ష్యంతో జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి (DMFT) ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేయించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు DMFT నిధుల ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేయించడం ప్రజలకు ఎంతో మేలు చేసే నిర్ణయమని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తమ ధన్యవాదాలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఎల్కతుర్తి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.








