మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 04
గత వారం రోజులుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజలందరికీ నిరంతరాయంగా నీటి సరఫరాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు.
గత వారం రోజులుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజలందరికీ నిరంతరాయంగా నీటి సరఫరాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు.
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణ మాజీ అధ్యక్షులు గాదె సత్యం, కార్పొరేటర్లు గుమ్మడి శ్రీనివాస్, అబ్దుల్ సత్తార్, పెట్టం స్వరూప-లక్ష్మణ్ లు ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందించారు.
నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని వారు కమిషనర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












