Mancherial/Hajipur (అక్షరవేకువ) జూన్ 28
తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్ లోని కిందిస్థాయి పోలీస్ సిబ్బందికి మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఆర్ఎస్ఐ, ఆర్ఐ, డిసి, కమాండెంట్ వంటి పైస్థాయి అధికారుల బిల్లులు ఏవీ పెండింగ్‌లో లేవని, కేవలం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు మాత్రమే బిల్లులు పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హాజీపూర్ మండలం, మంచిర్యాల/హాజీపూర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 13వ బెటాలియన్ లోని పలువురు కిందిస్థాయి పోలీస్ సిబ్బందికి మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై ఉన్నతాధికారుల వివక్ష చూపుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఆర్ఎస్ఐ, ఆర్ఐ, డిసి, కమాండెంట్ వంటి పైస్థాయి అధికారుల బిల్లులు ఏవీ పెండింగ్‌లో లేవని, కేవలం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు మాత్రమే బిల్లులు పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు పనిచేసే తమకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడం కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 13 ప్రత్యేక పోలీసు బెటాలియన్లు ఉండగా, అన్ని బెటాలియన్లలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నా, కేవలం 13వ బెటాలియన్ కిందిస్థాయి సిబ్బందికి మాత్రమే ఇవి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
హెచ్ఆర్ఏ పెంపుపై డిమాండ్: మరోవైపు, బెటాలియన్ పోలీస్ సిబ్బందికి ప్రస్తుతం 13 శాతం మాత్రమే హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నారని, ఏడాది క్రితం గుడిపేటలోని 13వ బెటాలియన్ మంచిరాల కార్పొరేషన్‌లోని 18వ డివిజన్‌గా మారినందున 17 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్‌గా మారినా పాత 13 శాతంతోనే కొనసాగడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని, హెచ్ఆర్ఏ పెంచి చెల్లించాలని వారు కోరుతున్నారు.












