సంగారెడ్డి, 22 October
జిల్లా టీఎన్జీవోస్ సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి నిర్మల రాజకుమారి ఆధ్వర్యంలో జరిగిన ప్రక్రియలో మహమ్మద్ జావిద్ అలీ అధ్యక్షుడిగా, వేల్పూరు రవి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని నూతన కార్యవర్గం తెలిపింది.
జిల్లా టీఎన్జీవోస్ సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సెంట్రల్ యూనియన్ మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మల రాజకుమారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జిల్లా టీఎన్జీవోస్ నూతన జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ జావిద్ అలీ, జిల్లా కార్యదర్శిగా వేల్పూరు రవి, అసోసియేట్ అధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, కోశాధికారిగా కసిని శ్రీకాంత్, లీగల్ అడ్వైజర్‌గా భాస్కర్, ఉపాధ్యక్షులుగా కృష్ణ, నాగేశ్వరరావు, శ్రీకాంత్, విజయలక్ష్మి, జాయింట్ సెక్రెటరీలుగా షకీల్, నరసింహారెడ్డి, మోహనప్ప, సుధామణి, ఆఫీస్ సెక్రెటరీగా సాయికుమార్, స్పోర్ట్స్ సెక్రెటరీగా వెంకటేశం, రవికుమార్, మాణిక్యం, ఈసీ మెంబర్లుగా విజయ్ కుమార్, మురళీధర్, లక్ష్మి, పుష్పలత, బషీర్, సురేఖ, వినయ్, బాలామణి, శ్యాంసుందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూరు రవి మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పని చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. జిల్లా టీఎన్జీవోస్ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుండి నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలరాం, జగన్, పట్టణ బాధ్యులు ప్రమోద్ కుమార్, యాదవ్ రెడ్డి, వెంకట్, మిస్కిన్, దత్తు, నర్సింలు, దుర్గయ్య పాల్గొన్నారు.












