భీమారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోడేటి రవిని, పలువురు కాంగ్రెస్ నాయకులు, సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
మంచిర్యాల జిల్లాలోని భీమారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పోడేటి రవికి, పోలంపల్లి మాజీ సర్పంచ్ దర్శనాల రమేష్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా దర్శనాల రమేష్ మాట్లాడుతూ, పోడేటి రవి నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో భీమారం మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని, తమ సంఘం తరఫున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
నూతన అధ్యక్షుడు పోడేటి రవి మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో దుర్గం శివ, కేశవేణి సత్యనారాయణ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పోడేటి రవికి శుభాకాంక్షలు తెలిపారు.











