భారతీయ జనతా పార్టీ (బిజెపి) గర్మిళ్ళ జోన్ ఆధ్వర్యంలో మంగళవారం దుర్గామాత దేవాలయంలో మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలు బైరి లక్ష్మి, ఆదేపు శ్రీలత గారి నేతృత్వంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నెల 10వ తేదీన రాష్ట్ర రాజధానిలో జరగనున్న సభ సందర్భంగా, రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని దుర్గామాతను వేడుకుంటూ అర్చకులతో ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.
మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్మీళ్ళ జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజకుమార్, ఆదేపు రాజబాబు, మేరడికొండ శ్రీనివాస్, బింగి సత్యనారాయణ, తోట మల్లికార్జున్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గర్మీళ్ళ జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజకుమార్ మాట్లాడుతూ, దేశాన్ని పరిరక్షించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలందరూ గుర్తించి ఆదరిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ప్రజలు బిజెపికి పట్టం కట్టారని ఆయన తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి, గెలిపించి దేశ చరిత్ర సృష్టించారని రాజకుమార్ పేర్కొన్నారు.











