భారతీయ జనతా పార్టీ గర్మిళ్ళ జోన్ ఆధ్వర్యంలో మంగళవారం దుర్గామాత దేవాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు బైరి లక్ష్మి, ఆదేపు శ్రీలత గారి నేతృత్వంలో మహా హారతి కార్యక్రమం జరిగింది. ఈ నెల 10న రాష్ట్ర రాజధానిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని ఈ పూజలు నిర్వహించారు.
గర్మిళ్ళ జోన్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని అర్చకులతో ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గర్మీళ్ళ జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజకుమార్, ఆదేపు రాజబాబు, మేరడికొండ శ్రీనివాస్, బింగి సత్యనారాయణ, తోట మల్లికార్జున్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజకుమార్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిందని, పశ్చిమ బెంగాల్ లోనూ పార్టీకి మద్దతు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.











