Mancherial/Hajipur (అక్షరవేకువ) జూన్ 29
ఖరీఫ్ సాగుకు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న హాజీపూర్ మండల రైతులు వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది 6,000 ఎకరాల్లో పత్తి, 83,000 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 14,500 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. వర్షాలు కురిస్తేనే వరి, ఇతర పంటల సాగుపై స్పష్టత రానుంది.
ఖరీఫ్ సాగుకు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది హాజీపూర్ మండలంలో 6,000 ఎకరాల్లో పత్తి, 83,000 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 14,500 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 6వేల ఎకరాల్లో పత్తి వేసేందుకు రైతులు విత్తనాలు తీసుకెళ్లారు. వర్షపాతాన్ని బట్టి వరి సాగు చేసే అవకాశం ఉన్నది. ఇతర పంటల సాగు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












