హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జనగ్రహ సభను విజయవంతం చేసేందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజుకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ విజయవంతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 5వ తేదీన మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా హారతి, రంగవల్లుల కార్యక్రమాలు, 6వ తేదీన బీసీ మోర్చా ఆధ్వర్యంలో వ్యాపారులతో సమావేశం, 7వ తేదీన దళిత మోర్చా ఆధ్వర్యంలో దళిత బస్తీల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 8వ తేదీన యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ద్వారా సభ ప్రాముఖ్యతను ప్రచారం చేయాలని తెలిపారు.
ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుని, అధిక సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యేలా కృషి చేయాలని కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











