న్యూఢిల్లీ, 2026-06-05
పెద్దపల్లి పార్లమెట్ నియోజకర్గలో పారి్రామిక అసరాలకు అనుగుణగా యుతకు నైపుణ్య ిక్షణ అదిచేదుకు - క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని తెలగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి ాఖ మత్రి డాక్టర్ జి. ిేక్ ెకటస్ామి, పెద్దపల్లి ఎప గడ్డ కృష్ణ కేద్ర భార పరి్రమల ాఖ మత్రి హెచ్.డి. కుమారస్ామిని కోరారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు - క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని కలిసి పెద్దపల్లి ప్రాంతానికి - క్లస్టర్ అవసరాన్ని వివరించారు.
- కార్యక్రమంలో తెలంగాణ ప్రగతి
తెలంగాణ రాష్ట్రం - కార్యక్రమంలో అగ్రగామిగా ఉన్న నేపథ్యంలో, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక - క్లస్టర్‌ను ద్వారా ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామిక, మైనింగ్ బెల్ట్‌గా ఉన్నందున ఈ ప్రాంత యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కేంద్ర మంత్రికి వివరించారు.
శిక్షణ కోర్సుల ప్రతిపాదన
ప్రత్యేకంగా మైనింగ్, మెటల్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాలకు అనుగుణంగా శిక్షణ కోర్సులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల స్థానిక యువతకు పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహనతో పాటు ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అప్రెంటిస్‌షిప్, ఆన్ది-జాబ్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ వంటి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ని - హబ్‌గా, ఇతర లను స్పోక్‌లుగా గుర్తించి క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు.
ఉపాధి అవకాశాల పెంపు
ఈ విధానం ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నైపుణ్యంతో కూడిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయడంతో పాటు స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని వివరించారు. - క్లస్టర్ ఏర్పాటుకు తో పాటు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు.
కేంద్ర మంత్రి సానుకూల స్పందన
వారి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రాంత యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్, ఉపాధి అవకాశాలు పెంచేందుకు - క్లస్టర్ కీలకంగా నిలుస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.












