తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో షెట్పల్లి గ్రామంలో DCMS వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది.
ఈ కేంద్రాన్ని డాక్టర్ గడ్దం వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. షెట్పల్లి సర్పంచ్ మంత్రి గోపీకృష్ణ ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, సెంటర్ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు మరియు యువత పాల్గొన్నారు.
సర్పంచ్ మంత్రి గోపీకృష్ణ మాట్లాడుతూ, రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర ప్రయోజనాన్ని పొందాలని కోరారు.
గ్రామ ప్రజలు ఈ చర్య పట్ల హర్షం వ్యక్తం చేశారు.











