మంచిర్యాల జిల్లా DMHO శాఖ మరియు దిశ (DISHA) ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH)లో ఎయిడ్స్ అవగాహన మరియు నివారణ ప్రచారంలో భాగంగా ప్రత్యేక వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎయిడ్స్ పట్ల అప్రమత్తత, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకపోవడం, సురక్షిత జీవనశైలి ప్రాముఖ్యతను తెలియజేశారు.
ప్రజా పాలనా ప్రగతి ప్రణాలికా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వాకథాన్‌లో పలువురు వైద్యులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ మరియు దానిపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్య అతిథులుగా DMHO డాక్టర్ ఎస్. అనిత, GGH సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, ఎయిడ్స్ & లెప్రసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, MCH ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అరుణ శ్రీ, GGH RMO డాక్టర్ శ్రీమన్నారాయణ, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి సుజాత హాజరయ్యారు. వీరు ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు.









