Mancherial/Hajipur (అక్షరవేకువ) జూన్ 29
హాజీపూర్ మండలం దొరమండ పెద్దంపేట వంతెన వద్ద నాసిరకం మట్టితో నిర్మించిన రోడ్డుపై ఆర్టీసీ బస్సు బురదలో దిగబడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 60 మంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. దాదాపు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హాజీపూర్ మండలం దొరమండ పెద్దంపేట వంతెన వద్ద నాసిరకం మట్టి కారణంగా ఆర్టీసీ బస్సు బురదలో దిగబడిపోయింది. దీంతో సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తులు, సర్పంచ్ సహాయంతో వెంటనే జేసీబీని తెప్పించి బస్సును బురదలోంచి బయటకు తీశారు. వెంటనే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, ప్రయాణికులు, రైతులు డిమాండ్ చేశారు.










