మంచేరియల్, 2026-11-22
మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం అవసరమని ప్రజలు కోరుతున్నారు. ఈ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం లభించడంతో పాటు పట్టణాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
ప్రధాన పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు గాంధీనగర్, అమరవాడ ప్రాంతాలకు అనుసంధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి వంటి సదుపాయాల అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్మాణాలు అందుబాటులోకి వస్తే పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు కొంత ఉపశమనం లభించడంతో పాటు కొత్త ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని వారు ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పట్టణ విస్తరణ, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కేంద్ర ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయడంతో పాటు అవసరమైన ఫ్లైఓవర్లు, వంతెనల నిర్మాణానికి కార్యాచరణ చేపడితే మంచిర్యాల రెండో పట్టణ ప్రాంతాల విస్తరణకు మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండు లక్షల జనాభా నివసించే జిల్లా కేంద్రంలో సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయి. 60 డివిజన్లతో మంచిర్యాల కార్పొరేషన్ గా అవతరించడంతో మరిన్ని సమస్యలు ముందుకు వచ్చాయి ఈ నేపథం లోనే జిల్లా కేంద్ర విస్తరణలో నూతన వరవడి సృష్టించేందుకు జనాభా సమస్యలు పరిష్కరించాలని అనుసంధానంగా ఫ్లైఓవర్ ఫుట్ ఓవర్ అత్యవసరం అన్న విషయాన్ని ప్రజా ప్రతినిధులు గుర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


