1) (అక్షరవేకువ) జూలై 30
సుందరశాల గ్రామపంచాయతీ పరిధిలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీని ఫలితంగా పలు గ్రామాల్లో ఇళ్ల గోడలు కూలిపోయి ఆస్తి నష్టం సంభవించింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిస్తోంది.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుందరశాల గ్రామపంచాయతీ పరిధిలోని సుందరశాల గ్రామంలో గుండా భాస్కర్ రెడ్డి ఇంటి గోడ పాక్షికంగా కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం సంభవించింది.
అలాగే, గ్రామపంచాయతీ పరిధిలోని నర్సక్క పేట గ్రామంలో నగరం బుచ్చయ్య, వేముల రాజయ్య ఇళ్ల గోడలు కూడా కూలిపోయాయి. పాగాపల్లె గ్రామంలో పాగే దాదయ్య గారి ఇంటి గోడ కూలింది. ఈ సంఘటనల్లోనూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న గుండా మంజుల రాంగోపాల్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ, వార్డు సభ్యులు బాధితులను పరామర్శించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఆదుకుంటామని సర్పంచ్ గుండా మంజుల రాంగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.











