మండలంలోని ఐకేపీ మరియు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
శుక్రవారం ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కొనుగోలు వివరాలను పరిశీలించి, రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వం ఊహించిన దానికంటే అధికంగా పంట దిగుబడి రావడంతో కొంత హమాలీల కొరత ఏర్పడిందని, అయితే కొనుగోళ్లను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల అభ్యున్నతే లక్ష్యమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు సూచనలు చేస్తే మంచిదని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.












