హజీపూర్, 2 July
హాజీపూర్ మండలం గుడిపేట్ రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ పరిధిలోని పత్తి ఉత్పాదకత మిషన్ (కపాస్ కాంతి 2026) పథకం కింద మంగళవారం క్లస్టర్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనలు అధిక సాంద్రత, దగ్గర వరుసల సాగు, సమగ్ర పంట యాజమాన్యం పద్ధతుల్లో 133 హెక్టార్లలో జరుగుతాయి.
హాజీపూర్ మండలం గుడిపేట్ రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ పరిధిలోని పత్తి ఉత్పాదకత మిషన్ (కపాస్ కాంతి 2026) పథకం కింద క్లస్టర్ ప్రదర్శనలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనలు మూడు అంశాల ద్వారా మొత్తం 133 హెక్టార్లలో చేపట్టబడుతున్నాయి.
అధిక సాంద్రత పత్తి సాగు కింద 86 హెక్టర్లు, దగ్గర వరుసల మధ్య దూరంతో పత్తి సాగు (క్లోజర్ స్పేసింగ్) కింద 36 హెక్టర్లు, సమగ్ర పంట యాజమాన్యం (ICM) కింద 11 హెక్టర్లలో ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి.
అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో సాధారణ సాగుతో పోలిస్తే ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటడం వల్ల భూమి వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. ప్రారంభ దశలో కలుపు నియంత్రణ మెరుగుపడి, అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి తేలికపాటి ఎర్ర నేలలు, దుబ్బ నేలలకు అనుకూలంగా ఉండి, పంట త్వరగా కోతకు వస్తుంది.
దగ్గర వరుసల మధ్య దూరంతో పత్తి సాగు (క్లోజర్ స్పేసింగ్) ద్వారా మొక్కల సాంద్రత పెరిగి, సూర్యరశ్మి, పోషకాల వినియోగం మెరుగుపడుతుంది. దీనివల్ల ప్రారంభ దశలోనే మంచి పెరుగుదలతో పాటు అధిక దిగుబడి సాధించే అవకాశాలు పెరుగుతాయి.
ఈ పథకం కింద ప్రభుత్వంచే రాయితీపై అందజేసిన పత్తి విత్తనాల ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఆత్మ ఛైర్మెన్ సింగతి మురళి ప్రారంభించారు.
జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల సురేఖ మేడమ్, ADA మంచిర్యాల మామిడి క్రిష్ణ, ఆత్మ ఛైర్మెన్ సింగతి మురళి, FPO డైరెక్టర్ పుస్కూరి శ్రీనివాస రావు, స్థానిక కార్పొరేటర్ కమల శ్రీనివాస్ గౌడ్, చిన్న గోపాల్ పూర్ సర్పంచ్ జుగునాక రాజేష్, PACS డైరెక్టర్ నాగేష్, ATMA డైరెక్టర్ మునిమడుగుల శ్రీనివాస్, కర్ర సునీత జగన్ రెడ్డి, AO హాజీపూర్ క్రిష్ణ, AEO మధుప, మౌనిక, కొమురయ్య.












