నర్సింగాపూర్ (అక్షరవేకువ) జూలై 17
నర్సింగాపూర్ గ్రామంలో సహజ వ్యవసాయం, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) కార్యక్రమాన్ని 17.7.2026న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహజ వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
నర్సింగాపూర్ గ్రామం, హాజీపూర్ మండలం, మంచిర్యాల డివిజన్ లోని నర్సింగాపూర్ గ్రామంలో 17.7.2026న సహజ వ్యవసాయం మరియు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రెస్, మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు.
సహజ వ్యవసాయం పశుపోషణతో ముడిపడి ఉంటుందని, ఇందులో బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి వంటివి పొలంలోనే తయారు చేసుకునే విధానాలను, బహుళ పంటల సాగు పద్ధతులను వివరించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, కూరగాయలు, మెట్ట పంటలైన జొన్న పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వరి పంటకు వినియోగించే నీటితో ఇతర పంటలను 2 నుండి 3 ఎకరాలు సాగు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హాజీపూర్ వ్యవసాయ అధికారి కృష్ణ, AEO మధుప, కృషి సఖి స్వప్న, సేంద్రీయ వ్యవసాయ రైతులైన గడ్డం రవీందర్ రెడ్డి, గంగా రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇతర రైతులు పాల్గొన్నారు.












