గుడిపేట్ (అక్షరవేకువ) జూలై 28
ైనేసంాయమం100ఎసోయోానఫెనసదాాగేటైేదో28-07-2026ఉదయంషంచాసందభంగాాోనమగగఅభయదయై,ఇదదయసాయసణఅధాభంనసనమానంచేశా
మంచిర్యాల రూరల్ లోఈ రోజు 28-07-2026 ఉదయం 9.30 గంటలకు రైతు నేస్తం 100వ ఎపిసోడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదిక, గుడిపేట్ నందు ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది.
100వ ఎపిసోడ్ లో భాగంగా జిల్లాలోని ప్రతి రైతు నేస్తం కార్యక్రమానికి హాజరైన ముగ్గురు అభ్యుదయ రైతులకు సన్మానం చేశారు. పుస్కూరి శ్రీనివాస రావు (హాజీపూర్ మండలం), సంతోషం శ్రీలత (చెన్నూరు మండలం), మోర్లా భీమర (భీమిని మండలం) ఈ సన్మానం అందుకున్నారు.
అలాగే, జిల్లాలో రైతు నేస్తం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యవసాయ విస్తరణ అధికారులు మధుప రెడ్డి (రైతు వేదిక, గుడిపేట్, హాజీపూర్ మండలం), సంతోష్ కుమార్ (రైతు వేదిక, జన్కపూర్, కన్నెపల్లి మండలం) లకు ప్రభుత్వం తరపున మెమెంటోతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మేడమ్ మాట్లాడుతూ, 'ఎల్ నినో' ప్రభావంతో తక్కువ వర్షపాతం కారణంగా రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎకరం వరి పంటకు అయ్యే నీటితో 4 నుండి 5 ఎకరాల ఆరుతడి పంటలు సాగు చేయవచ్చని సూచించారు. ప్రతి రైతు వేదికలో కందులు, పెసర, నువ్వులు, కురకాయ విత్తనాలు విత్తన మేళాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మేడమ్, ADA మంచిర్యాల మామిడి క్రిష్ణ, ATMA ఛైర్మెన్ సింగతి మురళి, FPO డైరెక్టర్ పుస్కూరి శ్రీనివాస రావు, బొడ్డు శంకర్, PACS ఛైర్మెన్ గుళ్ళకోట ప్రభాకర్ రావు, AMC డైరెక్టర్ మునిమడుగుల శ్రీనివాస్, AO హాజీపూర్ క్రిష్ణ, AEO మధుప, రైతులు పాల్గొన్నారు.











