నస్పూర్, 2026-07-20
SBI మాదిరిగానే తమకు కూడా ప్రమాద బీమా కల్పించాలని కోరుతూ సింగరేణి విశ్రాంత ఉద్యోగులు సోమవారం నస్పూర్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం అందజేసి, తమ డిమాండ్లను తెలియజేశారు.
SBI మాదిరిగానే యూనియన్ బ్యాంక్లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి కోల్ పెన్షన్ దారులకు ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. యూనియన్ బ్యాంకు లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి కోల్ మైన్స్ పెన్షన్ దారులకు 50 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని వారు కోరారు.
యూనియన్ బ్యాంకులకు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్లు, అధికారులు సింగరేణి కోల్ పెన్షన్ దారులకు 70 సంవత్సరాల లోపు ఖాతాలు కలిగి ఉన్న వారికి ప్రమాద భీమా సౌకర్యానికి సంబంధించిన ఒప్పంద పత్రాలలో పూర్తిగా క్లారిటీ లేదని ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా, యూనియన్ బ్యాంకు ఖాతాదారులైన బొగ్గు పెన్షన్ దారులకు ప్రమాద బీమా సౌకర్యం, సహజ మరణానికి కూడా బీమా సౌకర్యం ఉన్నదా లేదా అనే విషయం పత్రికల (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ముఖంగా సింగరేణి పెన్షన్ దారులకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరుతూ నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ బోగే సాగర్ గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కోశాధికారి బింగి రాజేశం, కార్యదర్శి ఎన్నం శంకర్, ఆర్గనైజర్ తణుకుల మోహన్, జిల్లా ఏరియా నాయకులు సంగెం రాంచందర్, మేడ రాజలింగు, టీ శ్రీహరి, ఎన్ సదాశివ, ఎండి ఖాదర్, హుస్సేన్, ఇ రాజనర్సు, రేకుల పర్వతాలు, బి ఒదయ్య, SD అబ్బాస్ అలీ, బాజీ రెడ్డి సురేష్, అర్వ మల్లయ్య, ఇరుకుల జనార్దన్, పి లక్ష్మయ్య, కె పోచయ్య, ఎస్ బాణయ్య, కె దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 'కల్పించాలి 50 లక్షల ప్రమాద భీమా సౌకర్యం', 'కల్పించాలి సహజ మరణానికి 10 లక్షల బీమా', 'వర్ధిల్లాలి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత' అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.












