హైదరాబాద్‌లోని కూకట్పల్లి, కె.పి.హెచ్.పి. హౌసింగ్ బోర్డ్‌లో నూతనంగా శ్రీ మీనాక్షి కేఫ్ & ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు హాజరయ్యారు.
కూకట్పల్లి, కె.పి.హెచ్.పి. హౌసింగ్ బోర్డ్‌లో శ్రీ మీనాక్షి కేఫ్ & ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. రెస్టారెంట్ ప్రోప్రేటర్ శివ చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తెలంగాణ పోలీస్ అథారిటీ కమిషన్ మెంబర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్, కార్పొరేటర్లు ముద్దం నరసింహన్న యాదవ్, మందాడి శ్రీనివాసరావు, యాదవ సంఘాల నాయకులు, ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అతిథులు రెస్టారెంట్‌ను సందర్శించి, అందించే సేవలను, ఆహార నాణ్యతను అభినందించారు. కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేయడానికి అనువైన ప్రదేశమని వారు అభిప్రాయపడ్డారు.
వివిధ రకాల వంటకాలతో పాటు, నాణ్యమైన సేవలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని రెస్టారెంట్ యాజమాన్యం తెలియజేసింది. స్థానిక ప్రజలకు అందుబాటు ధరల్లో ఆహారాన్ని అందించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.






