
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతోందని, దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు ఈ అక్రమ రవాణా కొనసాగుతున్నా, అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



















