సంగారెడ్డి, 2023-08-28
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారని సంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి చౌవాన్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారని సంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి చౌవాన్ ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, పాత్రికేయులకు, చిన్న, మధ్య తరహా పత్రికల ప్రతినిధులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావం, ఐక్యత, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రక్షాబంధన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని చౌవాన్ ఈశ్వర్ కోరారు.

