సంగారెడ్డి, 2026-08-25
హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, కార్యదర్శి ఎం.మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రంథాలయ ఆవరణలో పలు మొక్కలను నాటారు. గ్రంథాలయ సిబ్బందితో పాటు పాఠకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, కార్యదర్శి ఎం.మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రంథాలయ ఆవరణలో పలు మొక్కలను నాటారు. గ్రంథాలయ సిబ్బందితో పాటు పాఠకులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య మాట్లాడుతూ భూమిపై పచ్చదనాన్ని పెంపొందించడం, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఖాళీ ప్రదేశాలు, రహదారులకు ఇరువైపులా, అటవీ ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
మొక్కలను పెంచడం వల్ల వర్షపాతం మెరుగు పడటంతో పాటు వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గి పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.











