ఆదిలాబాద్ జిల్లా మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఆధార్ కార్డు విషయంలో భర్తతో జరిగిన గొడవ తట్టుకోలేక గర్భిణీ అయిన భార్య పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మండలం సోనాపూర్ కి చెందిన పార్వతి (20) కి ఏడాది క్రితం మాణిక్రావుతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భిణీ. వైద్య పరీక్షల కోసం ఆధార్ కార్డు అవసరమని భర్తను కోరింది. అయితే, ఆధార్ కార్డు విషయంలో భర్త జాప్యం చేయడంతో మనస్తాపానికి గురైన పార్వతి శుక్రవారం పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.












