మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కలగూర రాజ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కలగూర రాజ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాల్కా సుమన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ సర్పంచ్ దాసరి మణిదీపక్, దాంపూర్ మాజీ సర్పంచ్ దాసరి మదనయ్య, తెలంగాణ ఉద్యమకారులు చింతం తిరుపతి, జలంపల్లి సమ్మయ్య, లాజర్, చంద్రమౌళి, నక్క మల్లేశ్, బబ్లూ, సతీష్, పవన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బాల్కా సుమన్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












