బోథ్ మండలం పోచ్చేరా జలపాతం వద్ద, బోథ్ గ్రామానికి చెందిన పవార్ ప్రదీప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.

మృతదేహం గుర్తింపు
గురువారం పోచ్చేరా జలపాతం నీటి గుండంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. మృతుడు బోథ్ కు చెందిన ప్రదీప్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.