మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 14
చయొషధతయయణచశ.ఈఘధవత.వతచవత.ఉత.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో బీజేపీ మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణపై ఇటీవల జరిగిన దాడి కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో అద్దాలు ధ్వంసం అయినట్లు సమాచారం. పోలీసులకు అందిన సమాచారం మేరకు, దాడికి పాల్పడిన వారిలో మంచిర్యాలకు చెందిన అప్రోజ్, రుతిక్ సాయి పటేల్, సమీర్, గోదావరిఖనికి చెందిన బాలకృష్ణ ఉన్నట్లు మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ స్పష్టం చేశారు.
దాడి ఘటన నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. హింస ప్రేరేపిత దాడులను సహించేది లేదని సీఐ రవీందర్ అన్నారు. A1 అప్రోజ్, A2 బాలకృష్ణలను రిమాండ్ చేసినట్లు, A3 సాయి పటేల్, A4 సమీర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మంచిర్యాల రూరల్ పరిధిలో దాడులకు పాల్పడుతున్న, గుండాయిజం, రౌడీయిజం, దాగిరి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, రౌడీషీటింగ్ ఓపెన్ చేస్తామని రవీందర్ హెచ్చరించారు. గతంలో కూడా ఈ ముద్దాయిలకు దాడులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాలలో దాడుల సంస్కృతిపై పలువురు మండిపడుతున్నారు. మంచిర్యాల పేరు చెడగొట్టారని, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా హితవు పలుకుతున్నారు.












