మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 13
మంచిర్యాల టూ టౌన్ 56వ డివిజన్లో నివాసం ఉంటున్న గృహిణి దానమ్మ (43) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మంచిర్యాల టూ టౌన్ పరిధిలోని 56వ డివిజన్లో నివాసం ఉంటున్న దానమ్మ (43) అనే గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నెలరోజుల కిందట దంపతులు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు.
మృతురాలి మృతికి గల కారణాలపై మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు, ఎస్సై మధుసూదన్ ఆరా తీస్తున్నారు. దానమ్మ ఫోన్ ద్వారా వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












