మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 08
ఐవేధేవహణఖజవశెెబహవృఎఆవేవవెవవఠే.వేేవేవూఅ.ణవేశజవశేవహె.
మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీరిపై రౌడీషీటింగ్ నమోదు చేయడంతో పాటు, మత్తు పదార్థాలు సేవించే యువకులకు డి సెంటర్ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. క్షణిక సుఖం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాల సేవనం ఆరోగ్యానికి హానికరం అని పోలీసులు సూచిస్తున్నారు.
రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గస్తీని పెంచుతామని, ముఖ్యంగా బైపాస్ రోడ్, హమాలివాడ, తిలక్ నగర్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంచిర్యాల సీఐ ప్రమోదరావు తెలిపారు.












