11వ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అభయ ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు. కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
శ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అభయ ఆంజనేయస్వామి జయంతిని పురస్కరించుకొని ఉదయం నగర సంకీర్తనతో పాటు స్వామి వారికి అభిషేకం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ, ప్రజలందరూ భక్తి భావనతో ఉండాలని, అభయ ఆంజనేయస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమాన్ మాలదరణ స్వాముల కుటుంబాలపై స్వామివారి ఆశీస్సులు నిరంతరం ఉండాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలదరణ స్వాములు బుర్ర శ్రీనివాస్, అవునూరి భాస్కర్, కొమురయ్య, సత్యం, రుద్ర, కిషన్ రావు, మాల ధర్నా స్వాములతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.











