గుమ్మడిదల: సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, దైవ సేవయే మానవ సేవగా గత 24 ఏళ్లుగా సాగుతున్న సిద్ధి వినాయక అన్నప్రసాద వితరణ కార్యక్రమం, సిద్ధి వినాయక సంఘం ఆధ్వర్యంలో పాతికేళ్ల రజతోత్సవ మైలురాయిగా ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది.
భక్తులు, దాతల సహకారంతో రెండు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ఆదివారం రాత్రి భక్తజనం విశేష సంఖ్యలో తరలివచ్చారు. మన ప్రాచీన భోజన సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ, అంతరాలు లేకుండా భక్తులందరినీ నేలపై ఒకే వరుసలో కూర్చోబెట్టి, పచ్చటి అరటి ఆకుల్లో ఆప్యాయంగా మహా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి ఆత్మానంద ఆశ్రమాధిపతి పూజ్యపాదులు రాజయోగి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు దివ్య మంగళాశాసనాలు అందించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాధవి సత్యనారాయణ, కత్తుల రమేష్, కిషన్, దేవాలయ కమిటీ అధ్యక్షులు మద్దుల బాల్రెడ్డి, స్థానిక పెద్దలు మండలి భాషయ్య, పడమటి లక్ష్మారెడ్డి, చెన్నంశెట్టి సత్యనారాయణ, తులసీదాస్, దేవేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సిద్ధి వినాయక సంఘం కమిటీ సభ్యులు సూర్యనారాయణ, మహేష్ కుమార్, కూరగాయల నర్సింలు, ఉదయ్ కుమార్, నర్సింగ్ సాగర్, కృష్ణ, రాము, నరేష్, నవీన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.











