జోగిపేట పట్టణంలోని పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.










