మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 26
మచిర్యజి్ద్రమదిరజఆరధ్యదపెద్దమ్మత్ిఅర,్పజరియి.120సమూహిటచెదిమహిళశిరస్సధరిచి,పెద్దమ్మత్ిిస్మరిస్తూఊరిపప్ొ్ర.ఐీసెటర్రీఎత్తశయత్రిర్హిచర.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ బోనాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. 120 సామూహిక కుటుంబాలకు చెందిన మహిళలు బోనాలను శిరస్సున ధరించి, పెద్దమ్మతల్లిని స్మరిస్తూ బోనాల ఊరేగింపు చేపట్టారు. ఐబీ సెంటర్లో భారీ ఎత్తున శోభాయాత్రను నిర్వహించారు.
రాంనగర్లోని పెద్దమ్మ తల్లి బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరకు కుల సంఘాలతో పాటు ఇతర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో బోనాలతో హాజరయ్యారు. డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుని సాంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించారు.
ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహిస్తామని ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సరోజ కొమురయ్య, రాష్ట్ర సంఘం కార్యదర్శి దబ్బెట తిరుపతి, నూనె రాజేశం తదితరులు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు పాల్గొన్నారు.












