మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లక్ష్మీ దేవర బోనాల జాతర ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.
ఆదివారం రాత్రి ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు.
సోమవారం నాడు అమ్మవారికి బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
పారుపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ జాతరలో పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరారు.
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.












