హైదరాబాద్ రవీంద్రభారతిలో త్రైత శకం 48 కాలసూచికను ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఈ సమగ్ర కాలసూచికను సమాచార హక్కు చట్ట సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి విడుదల చేశారు.
హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కాలసూచికలో ఆధ్యాత్మిక విషయాలను సరళమైన భాషలో పొందుపరిచినట్లు చంటి ముదిరాజ్ తెలిపారు. శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానం ఇందులో విశదంగా వివరించబడిందని పేర్కొన్నారు.
జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విశిష్టతలను వివరిస్తూ, 'యుగాది' అనే పదం 'ఉగాది'గా మారిన విధానాన్ని కూడా ఈ కాలసూచికలో అర్థవంతంగా వివరించారు. ఇది ఆధ్యాత్మిక సాధకులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
చైత్రమాసం నుండి ఫాల్గుణమాసం వరకు తెలుగు సంప్రదాయ కాలమానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కాలసూచికను రూపొందించడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది తెలుగు సంప్రదాయాలను, కాలగణనను తెలియజేస్తుంది.












